పెళ్లివ్యాను బోల్తా పడి ఏడుగురు మృతిచెందారు. ఈ ఘోర ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ ఘాట్‌రోడ్డులో వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగింది. వివాహానికి హాజరై తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో వ్యాను కొండపై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను గోకవరం మండలం ఠాకుర్‌పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో వ్యానులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి - Road accident in East Godavari District
![తూర్పు గోదావరి జిల్లాలో పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి accident in east godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9362006-536-9362006-1604023570318.jpg)
తూర్పు గోదావరి జిల్లాలో పెళ్లి వ్యాను బోల్తా
05:51 October 30
పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి
తూర్పు గోదావరి జిల్లాలో పెళ్లి వ్యాను బోల్తా
మృతులు:కంబాల భాను (గోకవరం), సింహాద్రి ప్రసాద్ (ఠాకూర్ పాలెం), ఎల్లా లక్ష్మీ (దివాన్ చెరువు), ఎల్లా దివ్య శ్రీలక్ష్మి (దివాన్ చెరువు), చాగంటి మోహిని (గాదారాడ), పచ్చకూరి నరసింహ (గంగంపాలెం).
Last Updated : Oct 30, 2020, 7:45 AM IST