ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

భారీగా ఎర్రచందనం పట్టివేత.. తరలింపులో అంతర్జాతీయ స్మగ్లర్లు! - ఎర్రచందనం పట్టివేత: దుంగల విలువ సుమారు3 కోట్ల పైమాటే..!

కడప జిల్లా పోలీసులు నల్లమల అటవీ ప్రాంతంలో భారీగా ఎర్రచందనం పట్టుకున్నారు. రవాణాకు సిద్ధం చేసిన లారీని స్వాధీనం చేసుకున్నారు.

దుంగల విలువ సుమారు 2 కోట్ల పైమాటే..!

By

Published : Aug 2, 2019, 10:54 AM IST

Updated : Aug 2, 2019, 1:25 PM IST

భారీగా ఎర్రచందనం పట్టివేత

కడప జిల్లా కాశీనాయన మండలం నల్లమల అటవీప్రాంతంలో పోలీసులు భారీగా ఎర్రచందనం పట్టుకున్నారు. రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు రూ. 3 కోట్ల విలువగల 94 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, రక్షకభటుల సాయంతో జ్యోతి క్షేత్రం చెలిమ బావి వద్ద దాడులు చేశారు. ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని.. లారీని సీజ్​ చేశామని డీఎఫ్​వో గురుప్రభాకర్​ వెల్లడించారు. ఈ దోపిడీలో అంతర్జాతీయ స్మగ్లర్ల హస్తముందని అనుమానిస్తున్నామని తెలిపారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Last Updated : Aug 2, 2019, 1:25 PM IST

For All Latest Updates

TAGGED:

ap crime

ABOUT THE AUTHOR

...view details