తెలంగాణలోని బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మంది నిందితులను అరెస్టు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పోలీసుల అదుపులో విజయవాడకు చెందిన సిద్ధార్థతో పాటు మరో 14 మంది ఉన్నారని వెల్లడించారు. కిడ్నాప్ కోసం సిద్ధార్థ... విజయవాడ నుంచి 20 మందిని పంపించాడని సీపీ వెల్లడించారు. సిద్ధార్థకు గుంటూరు శ్రీను రూ.5 లక్షలతో పాటు 20 మందికి తలా రూ.25 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.
భార్గవరామ్ ఇంట్లోనే ప్రవీణ్ సోదరుల అపహరణకు వ్యూహం పన్నారని సీపీ తెలిపారు. గుంటూరు శ్రీను, అఖిలప్రియ కలిసి ఈ నెల 2న పథకం వేసినట్లు వెల్లడించారు. ఈ నెల 4న ఎంజీహెచ్ పాఠశాలలో మరోసారి సమావేశమైనట్లు తెలిపారు. ప్రవీణ్ సోదరుల ఇంటి వద్ద సంపత్, చెన్నయ్యలు రెక్కీ చేసి... కిడ్నాప్‌నకు పాల్పడినట్లు వివరించారు.