తెలంగాణలోని శంషాబాద్లో యువతి హత్య కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనలు నిర్వహించడం వల్ల నిందితులను కోర్టుకు తీసుకెళ్లలేదు. దీంతో తహసీల్దారు పాండునాయక్ పోలీస్ స్టేషన్కు వచ్చి, నలుగురిని విచారించారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిరసనకారులు పోలీసుల వాహనాలపైకి రాళ్లు, చెప్పులు విసిరారు. కఠినంగా శిక్షించాలని యువకులు, విద్యార్థులు దారి పొడవునా నినాదాలు చేశారు. అడుగడుగునా నిందితులను తరలిస్తున్న వాహనాలను స్థానికులు అడ్డుకున్నారు.
'శంషాబాద్' నిందితులకు 14 రోజుల రిమాండ్ - Missing vet's body found in Shadnagar
తెలంగాణలో పశువైద్యురాలి హత్య కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. తహసీల్దారు పాండునాయక్ పోలీస్ స్టేషన్కు వచ్చి, నలుగురిని విచారించి రిమాండ్ విధించారు. అనంతరం వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
'శంషాబాద్' నిందితులకు 14 రోజుల రిమాండ్
TAGGED:
HYD