ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఓ భవంతిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనలో 28మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంటలు అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారి కోసం సిబ్బంది గాలిస్తోంది. ప్రమాదం జరగడానికి గల కారణాల్లో ఇంకా స్పష్టత లేదు. 200లకు పైగా అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర రక్షణ దళాలు ఘటనాస్థలంలో మంటలను అదుపు చేయడానికి శ్రమిస్తున్నాయి.