ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / international

నకిలీదని తెలిసే చేరారు..! - University of Farmington

అమెరికాలోని ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం నకిలీదని తెలిసే విదేశీ విద్యార్థులు చేరారని అమెరికా అధికారులు తెలిపారు.

యూనివర్సిటీ ఆఫ్​ ఫార్మింగ్టన్

By

Published : Feb 5, 2019, 1:18 PM IST

యూనివర్సిటీ ఆఫ్​ ఫార్మింగ్టన్​​ గురించి అంతా తెలిసే విదేశీ విద్యార్థులు నేరానికి పాల్పడ్డారని అమెరికా అధికారులు బదులిచ్చారు. ఈ నకిలీ విశ్వవిద్యాలయం వ్యవహారంలో భారత విద్యార్థులు పట్టుబడిన సంగతి తెలిసిందే. భారత దౌత్య అధికారులు అమెరికా ఇమ్మిగ్రేషన్​ అధికారులను సంప్రదించగా ఈ విషయం తేలింది.

" పట్టుబడ్డ 130 మంది విదేశీ విద్యార్థులకు వారు చేస్తున్న నేరం గురించి తెలుసు. ఉన్నత విద్యకోసం నమోదు చేసుకున్న విశ్వవిద్యాలయం నకిలీదనీ వారికి ముందే తెలుసు. అమెరికాలో ఉండాలన్న కోరికతోనే ఈ చర్యకు పాల్పడ్డారు. యూనివర్సిటీ ఆఫ్​ ఫార్మింగ్టన్​​లో ఉపాధ్యాయులు లేరని, తరగతులు జరగవని ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారందరికీ తెలుసు. అన్నీ తెలిసే వారందరూ ఈ నేరంలో భాగస్వాములయ్యారు."
- అమెరికా అధికార ప్రతినిధి

'అమెరికా' ఆశతో వల

విద్యార్థులకు తక్కువ బోధనా రుసుముతో పాటు కళాశాలలో పేరు నమోదుచేసుకున్న వెంటనే చదువుకుంటూ పనిచేసుకునేందుకు అనుమతులను కల్పించింది యూనివర్సిటీ ఆఫ్​ ఫార్మింగ్టన్​​. దాదాపు 600 మంది విద్యార్థులు ఇందులో చేరగా అందులో ఎక్కవమంది భారతీయులే.

వీరందరినీ విడిపించేందుకు తగిన ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం.

అమెరికాలో అక్రమంగా నివసించేందుకు మోసాలకు పాల్పడిన విదేశీ విద్యార్థులను యూఎస్​ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ హోమ్​లాండ్​ సెక్యూరిటీ(డీహెచ్​ఎస్​) అధికారులు గతవారం అరెస్టు చేశారు. వారిలో కొంత మందిని ఇదివరకే అధికారులు విడుదల చేశారు. 130 మందిలో 129 మంది భారతీయులే.

నేరాన్ని అంగీకరించని నిర్వాహకులు

ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది భారతీయులు తాము ఏ తప్పూ చేయలేదని సమర్థించుకుంటున్నారు. దోషులను మిచిగాన్​లోని ఫెడరల్​ కోర్టులో హాజరు పరిచారు అమెరికా అధికారులు. అయితే యూనివర్సిటీ నిర్వాహకులు తాము తప్పు చేయలేదని కోర్టుకు సమాధానమిచ్చినట్లు అధికారులు తెలిపారు.

అమెరికా అధికారులు గత సోమవారం ఈ ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఒకరు పూచీకత్తుపై బయటికి రాగా, మరో ఏడుగురు జైల్లోనే ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details