ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / headlines

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్ష: దేవినేని - మంత్రి కొడాలి నాని వార్తలు

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఇవాళ కృష్ణా జిల్లా గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు దిగనున్నట్లు తెలిపారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారని జగన్​ను నిలదీసే ధైర్యం కొడాలి నానికి ఉందా అని ప్రశ్నించారు.

devineni uma maheswara rao
devineni uma maheswara rao

By

Published : Jan 18, 2021, 8:11 PM IST

Updated : Jan 19, 2021, 7:32 AM IST

కృష్ణా జిల్లా గొల్లపూడిలో మంత్రి కొడాలి నాని చేసిన విమర్శలకు నిరసనగా అదే గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఇవాళ దీక్షకు దిగనున్నట్లు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆపడానికి ఎవరు వచ్చినా తేల్చుకునేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. బూతుల మంత్రితో ముఖ్యమంత్రి జగన్ పిచ్చి మాటలు మాట్లాడించారని దుయ్యబట్టారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో జగన్​ని నిలదీసే ధైర్యం మంత్రి కొడాలి నానికి ఉందా అని ప్రశ్నించారు. 2 సార్లు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చి సాయం చేసిన చంద్రబాబుపై నోటికొచ్చినట్లు మాట్లాడతారా అని ధ్వజమెత్తారు.

Last Updated : Jan 19, 2021, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details