కెరీర్ అత్యుత్తమ ఏటీపీ ర్యాంకుకు ప్రజ్నేశ్ - ఏటీపీ
పదేళ్లలో ఏటీపీ పరుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్-100లో చోటు దక్కించుకున్న మూడో భారత ఆటగాడిగా ప్రజ్నేశ్ రికార్డు సాధించాడు.
ఏటీపీ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరణ్ అరుదైన ఘనత సాధించాడు. నిలకడైన ఆటతీరుతో ఏటీపీ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో 97వ స్థానానికి చేరాడు. దీంతో పురుషుల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాకు ఎంపికయ్యాడు.
గత వారం ఏటీపీ చెన్నై ఛాలెంజర్‌లో సెమీఫైనల్‌కు చేరిన ప్రజ్నేశ్.. 2018లోనూ మెరుగైన ప్రదర్శన చేసి ఈ ఘనత అందుకున్నాడు. గత పదేళ్లలో సోమదేవ్ వర్మన్, యూకీ బాంబ్రీ తర్వాత ఈ ఫీట్ అందుకున్న మూడో భారత ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
ఇంతకు ముందు టాప్-100లో చోటు దక్కించుకున్న యూకీ బాంబ్రీ తరచూ గాయాలపాలవుతూ ఈ సారి 128 వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. రామ్‌కుమార్ రామనాథన్ 156వ స్థానంలో ఉన్నారు. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న 37వ ర్యాంకుతో ముందున్నాడు.