డిశ్చార్జ్ అయిన బాధితులకు చెక్కుల పంపిణీ - lg polymer updates
ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన బాధితులకు ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావులు చెక్కులను అందించారు. త్వరలోనే గ్రామస్థులకు వైద్య పరీక్షలు జరుపుతామని, దానికోసం ఒక ఆసుపత్రి కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
![డిశ్చార్జ్ అయిన బాధితులకు చెక్కుల పంపిణీ Distribution of checks to discharged victims of lg polymers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7201900-534-7201900-1589477948946.jpg)
ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన బాధితులకు.... ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు 25 వేల రూపాయల చెక్‌లను అందించారు. బాధిత గ్రామాలలో ప్రతి వ్యక్తికి పదివేల రూపాయల పరిహారం అందుతుందని తెలిపారు. త్వరలోనే గ్రామస్థులకు వైద్య పరీక్షలు జరుపుతామని, దానికోసం ఒక ఆసుపత్రి కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గ్రామస్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా తమ ఇళ్లకు వెళ్లాలని అన్నారు. ప్రమాదం పై ఆరు కమిటీలు ఏర్పాటు చేసి నివేదికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.