ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / elections

'ఈవీఎంల పని తీరు ఇప్పుడు గుర్తొచ్చిందా..?' - ap news

ఎన్నికల నిర్వహణపై సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై వైకాపా రాష్ట్ర ప్రతినిధి కొలుసు పార్థసారథి స్పందించారు. గత ఎన్నికల్లో ఈవీఎంల పని తీరుపై ఎటువంటి ఆరోపణలు చేయని ఆయన... ఇప్పుడు ఎందుకిలా వ్యవహరిస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు.

పనితీరు ఇప్పుడు గుర్తొచ్చిందా..?'

By

Published : Apr 14, 2019, 8:21 PM IST

గత ఎన్నికల్లో వాడింది ఈవీఎంలే : వైకాపా
ఎన్నికల నిర్వహణపై సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను వైకాపా రాష్ట్ర ప్రతినిధి కొలుసు పార్థసారథి తప్పుపట్టారు. గత ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై ఎటువంటి ఆరోపణలు చేయని తెదేపా... ప్రస్తుతం ఎందుకిలా వ్యవహరిస్తుందో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్థసారథి మాట్లాడారు.
పోలింగ్​ 80 శాతం పెరగడం... ప్రజాస్వామ్యానికి మంచిది కాదా అని ప్రశ్నించారు. దిల్లీలో విపక్షాలను కూడగట్టి చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్​ పార్టీ మూడు రాష్ట్రాల్లో ఈవీఎంల వినియోగంతోనే గెలిచిందని గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ సీఎం నాశనం చేశారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఆయన ఏనాడూ పాటించలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details