కడప జిల్లాలో ఫ్యాన్ గాలికి అడ్డు లేకుండాపోయింది. పది స్థానాలకు గాను 10 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2014లో వైకాపా 9 స్థానాల్లో గెలుపొందగా.. రాజంపేటలో తెదేపా అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి విజయం సాధించారు. ఎన్నికలకు ముందు మేడా వైసీపీలో చేరి.. రాజంపేట నుండి పోటీ చేసి గెలుపొందారు.
- పులివెందులలో వైఎస్ జగన్.. తెదేపా అభ్యర్థి వెంకట సతీష్‌రెడ్డిపై విజయం సాధించారు.
- బద్వేలులో వెంకటసుబ్బయ్య.. తెదేపా అభ్యర్థి రాజశేఖర్‌పై విజయం సాధించారు.
- కోడూర్లో కొరముట్ల శ్రీనివాసులు.. తెదేపా అభ్యర్థి నర్సింహప్రసాద్పై గెలుపొందారు.
- మైదుకూరులో రఘురామిరెడ్డి.. తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌పై గెలుపొందారు.
- కమలాపురంలో రవీంద్రనాథ్‌రెడ్డి తెదేపా అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై విజయం సాధించారు.
- రాజంపేటలో మేడా మల్లికార్జునరెడ్డి తెదేపా అభ్యర్థి బత్యాల చెంగల్రాయుడుపై గెలుపొందారు.
- జమ్మలమడుగులో సుధీర్‌రెడ్డి తెదేపా అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై గెలుపొందారు.
- ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెదేపా అభ్యర్థి లింగారెడ్డిపై గెలుపొందారు.
- కడపలో షేక్ అంజద్‌బాషా తెదేపా అభ్యర్థి అమీర్‌బాబుపై విజయం సాధించారు.
- రాయచోటిలో శ్రీకాంత్‌రెడ్డి తెదేపా అభ్యర్థి రమేష్‌కుమార్‌రెడ్డిపై గెలుపొందారు.