రేపు సార్వత్రిక ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకుందామనుకుంటున్న ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. ఓటరు స్లిప్పుల కోసం పోలింగ్ కేంద్రాలకు వెళ్లినవారు ఓటరు జాబితాలో తమ పేర్లు లేవని తెలిసి ఆందోళన చెందుతున్నారు. ఇదీ.. తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుత పరిస్థితి.
ఓటరు స్లిప్పులు అందని వారు.. ఓట్లు గల్లంతైన వారు రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. జాబితాలో పేర్లు లేవని చెప్పిన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. గత ఎన్నికల్లో ఓటు వేసిన తమ పేర్లు ఈసారి ఎలా తొలగించారంటూ ప్రశ్నించారు. వందల సంఖ్యలో ఓట్లు గల్లంతవుతున్నా..అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని వివరించారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఓటరు స్లిప్పు దేవుడెరుగు.. అసలు ఓటు ఉంటే ఒట్టు
ఓటు వినియోగించుకోండంటూ..పదే పదే చెప్తున్న ఈసీ.. గల్లంతైన ఓట్ల విషయంలో ఇసుమంతైనా పట్టించుకోవటం లేదని ప్రజలు వాపోతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు స్లిప్పుల కోసం వెళ్లిన వారికి... ఎన్నికల అధికారులు మొండి చేయి చూపుతున్నారని ఆవేదన చెందుతున్నారు రాజమహేంద్రవరం ప్రజలు. గత ఎన్నికల్లో ఓటు వేసిన వారికి ఈ సారి ఓటుహక్కు లేకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.
మీకు అసలు ఓటే లేదండి'
ఇవీ చదవండి.. 'ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి'