రాష్ట్రంలో అహంకారంతో కూడిన అరాచక పాలన కావాలో,.. అభివృద్ధి పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని తెలుగుదేశంపార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు తెదేపా అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి దువ్వ గ్రామంలో రోడ్‌షో నిర్వహించారు. తెదేపాను మళ్లీ గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. దువ్వతోపాటు అత్తిలిమండలంలోని పలు గ్రామాలలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై అనుసరించారు.
జగన్ అధికారంలోకి వస్తే.. అరాచక పాలనే: వంగవీటి రాధా - తెదేపా
తణుకు తెదేపా అభ్యర్థికి మద్దతుగా ఆ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ రోడ్‌షో నిర్వహించారు. తెదేపా అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమని ఓటర్లకు వివరించారు.
ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధాకృష్ణ