రేపటితో ప్రచార పర్వానికి తెరపడనున్న తరుణంలో రాజకీయ పార్టీలు ప్రచార వేగం పెంచాయి. ఓట్లు రాబట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. తమ కుటుంబీకులకు మద్దతుగా సినీ నటులు పాల్గొని ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
జనసేనకు మద్దతుగా నాగబాబు కుమారుడు హీరో వరుణ్‌తేజ్... పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రోడ్ షో నిర్వహించారు. తన తండ్రిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతపురం జిల్లాలో సినీనటుడు నారా రోహిత్ తెదేపా తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పుట్టపర్తి అభ్యర్థి పల్లె రఘనాథరెడ్డి, రాయదుర్గం అభ్యర్థి కాల్వ శ్రీనివాసులకు ఓటు వేయాలని కోరారు.
విజయనగరం జిల్లాలో నందమూరి బాలకృష్ణ రోడ్ షోకు హాజరయ్యారు. పార్లమెంట్ అభ్యర్థి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి అదితిలకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నారా రామ్మూర్తి తనయుడు..గిరీష్ తెదేపాకు మద్దతుగా ప్రచారం చేశారు. కృష్ణా జిల్లా కైకలూరులో బుల్లితెర నటులు భగవాన్, శ్రావణి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో జనసేన కార్యకర్తల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పార్టీ సిద్ధాంతాలు..అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలపై రూపొందించిన పాటలకు డ్యాన్సులతో ప్రచారం చేశారు. తెదేపాకు సంఘీభావంగా గుంటూరులో మహిళలు ర్యాలీ నిర్వహించారు.
ముగింపు ఉత్సాహం.. సకుటుంబ సపరివార ప్రచారం - serial actors
ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ..పార్టీలు ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. నేతలే కాకుండా వారి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 'కాదెవరూ ప్రచారానికి అనర్హం' అన్నట్లు సినీనటులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు పాల్గొని..తమ అభ్యర్థుల్ని గెలిపించాలని వేడుకుంటున్నారు.
కాదెవరు ప్రచారానికి అనర్హం
ఇవీ చదవండి..
Last Updated : Apr 8, 2019, 7:27 AM IST