ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / elections

దుబ్బాక ఉప ఎన్నిక పోరు... భాజపా జయకేతనం - దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా జయకేతనం

bjp-victory-in-dubbaka-by-poll-in-the-state-of-telangana
bjp-victory-in-dubbaka-by-poll-in-the-state-of-telangana

By

Published : Nov 10, 2020, 3:48 PM IST

Updated : Nov 10, 2020, 5:03 PM IST

15:47 November 10

దుబ్బాక ఉప ఎన్నిక పోరు... భాజపా జయకేతనం

దుబ్బాకలో ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ముగిసింది. చివరి వరకు ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఎన్నికల పోరులో భాజపా విజయభేరి మోగించింది. తెరాస అభ్యర్థి సుజాతపై భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. తెరాసపై 1068 ఓట్ల మెజార్టీతో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. రెండో స్థానంలో తెరాస, మూడో స్థానంలో కాంగ్రెస్‌ నిలిచాయి.

తెలంగాణ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ముగిసింది. అధికార తెరాస.. ప్రత్యర్థి భాజపా మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ పోటీ సాగింది.. రౌండ్ రౌండ్ కూ ఆధిక్యం ఇరు పార్టీల అభ్యర్థులనూ దోబూచులాడుతోంది. చివరకు విజయం భాజపాను వరించింది.

23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో తేలిపోయింది.భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. కొవిడ్‌-19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని...లెక్కించారు. రెండు హాళ్లలో ఏడేసి చొప్పున 14 టేబుళ్లు ఏర్పాటు చేసి...5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను లెక్కించారు. ఈవీఎంలు మొరాయించిన పక్షంలో వీవీ ప్యాట్లలోని స్లిప్పులను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 1,64,192 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 శాతం పోలింగ్‌ నమోదైంది.

దుబ్బాక ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ప్రధానంగా తెరాస, భాజపా నేతల మధ్య మాటల యుద్ధంతో రాజకీయంగా వేడి రగిలింది. తెరాస నుంచి సోలిపేట సుజాత, భాజపా నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీకి దిగిన విషయం తెలిసిందే. చివరకు భాజపా అభ్యర్థి రఘనందన్​రావు విజయఢంకా మోగించారు.

రౌండ్లు తెరాస భాజపా కాంగ్రెస్
1 2867 3208 648
2 5,357 6,492 1,315
3 7,964 9,223 1,931
4 10,371 13,055 2,158
5 13,497 16,517 2,724
6 17,559 20,226 3,254
7 20,277 22,762 4,003
8 22,772 25,878 5,125
9 25,101 29,291 5,800
10 28,049 31,783 6,699
11 30,815 34,748 8,582
12 32,715 36,745 10,662
13 35,539 39265 11,874
14 38,076 41,514 12,658
15 41,103 43,586 14,158
16 44,260 45,994 14,832
17 47,078 47,940 16,537
18 50,293 50,467 17,389
19 53,053 52082 18365
20 55493 55733 19423
21 57541 58161 20268
22 60,061 61,119 21,239
23 61,302 62,772 21,819

ఇదీ చదవండి:

ఫైజర్​ 'కరోనా వ్యాక్సిన్'​ 90శాతం ప్రభావవంతం!

Last Updated : Nov 10, 2020, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details