ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

cyber crime: జాప్ నౌ సంస్థ మాయాజాలం.. లక్షల్లో మోసం - సైబర్​ క్రైమ్​ వార్తలు

ఒక్క రూపాయికే కందిపప్పు, పంచదార, గోధుమ పిండి అందిస్తాము... డెలివరీ కూడా ఉచితమే అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రకటనలు నమ్ము తున్నారా.. అయితే అంతే సంగతులు. మీ జేబుకు చిల్లు పడినట్టే. ప్రకటనలు నమ్మి, వారు చెప్పినట్లు చేస్తే వస్తువులు రాకపోగా.. చెల్లించిన డబ్బులు కూడా వెనక్కి రావు. ఇది.. జాప్ నౌ అనే ఈ కామర్స్ సంస్థ మాయాజాలం. అసలు ఏంటి ఈ జాప్ నౌ....

zop now e commerce fraud in Hyderabad
zop now e commerce fraud in Hyderabad

By

Published : Jun 23, 2021, 9:06 AM IST

సైబర్‌ నేరస్థులు రోజురోజుకి సరికొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలు అవసరాలను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. జాప్ నౌ పేరుతో ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా.... నిత్యావసర వస్తువులు డెలివరీ చేస్తామని ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఈ మోసాలపై వరుస ఫిర్యాదులు అందడంతో.... సైబర్ క్రైం పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గూగుల్ యాడ్స్‌లో వివిధ రకాల వస్తువులు రూపాయికే అందిస్తామని వల విసరుతున్నారు. కార్ట్‌లో వస్తువులు యాడ్ చేసుకున్న తర్వాత కనీసం 1500 షాపింగ్ చేయాలని షరతు విధిస్తున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ లేకుండా ఆన్‌లైన్ చెల్లింపు చేయాలని నిబంధన పెట్టి సొమ్ము కాజేస్తున్నారు.

క్లిక్ చేస్తే

హైదరాబాద్ షేక్‌పేట దర్గాలో నివాసం ఉంటున్న ఓ స్తిరాస్థి వ్యాపారి... సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూస్తుండగా... తక్కువ ధరకే నిత్యావసర సరుకులంటూ జాప్‌నౌ పేరుతో ప్రకటన కనిపించింది. అది క్లిక్ చేయగానే హోం పేజీ తెరుచుకుంది. ఫోన్ నంబర్‌తో లాగిన్ అయ్యాడు. 2 వేల 805 రూపాయలు విలువ చేసే సరుకులు కేవలం 601 రూపాయలకే లభిస్తాయని కనిపించగా... ఓటీపీతో ఆర్డర్ చేశాడు. వస్తువులు డెలివరీ కాకపోవడంతో మరోసారి ప్రయత్నించాడు. ఇలా 4 వేలు ఆన్‌లైన్‌లో చెల్లించాడు. వస్తువులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సైబరాబాద్ పరిధిలో ఇప్పటి వరకూ 5 ఫిర్యాదులు

హైదరాబాద్ చందానగర్‌కి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తక్కువ ధరకు వస్తువులు లభిస్తున్నాయని భావించి మొబైల్ నంబర్‌తో జాప్‌నౌలో లాగిన అయి... కార్ట్‌లో కావాల్సిన వస్తువుల యాడ్ చేసుకున్నాడు. వాటి కోసం 1600 బదిలీ చేసినా... వస్తువులు రాలేదు. దీంతో చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాదాపూర్​కి చెందిన ఓ మహిళ ఇదే విధంగా తక్కువ ధరను చూసి పేమెంట్ చేసింది. ఇలా సైబరాబాద్ పరిధిలో ఇప్పటి వరకూ 5 ఫిర్యాదులు అందాయి. వీటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుకు ఫిర్యాదుల అందుతున్నాయిన తెలుసుకున్న నేరగాళ్లు వెబ్​సైట్​ను బ్లాక్ చేశారు.

నమ్మొద్దు

వస్తువులు కొన్న పలువురు కూడా సామాజిక మాధ్యమాల్లో నకిలీ వెబ్​సైట్ అంటూ పోస్టులు పెట్టడంతో ప్రస్తుతం జాప్ నౌ సైట్ గూగూల్​లో తెరచుకోవడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థుతుల్లో తక్కువ ధరకూ ఏ వస్తువూ రాదని.. అలా ఇస్తామంటే అది మోసమని గ్రహించాలని. ఎటువంటి అనుమానం ఉన్నా తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

70 శాతం మందికి తొలి డోసు పూర్తి!

ABOUT THE AUTHOR

...view details