Youtuber VS kalyani: తెలంగాణలోని హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్ పరిధిలో యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్‌రెడ్డిని సినీ నటి కరాటే కల్యాణి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి నిలదీసింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కల్యాణి ఆరోపించింది. ప్రాంక్ పేరుతో అమ్మాయిల, మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మద్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది.
యూట్యూబ్ ప్రాంక్‌స్టర్‌ను నిలదీసిన కరాటే కల్యాణి.. పరస్పరం దాడి - శ్రీకాంత్‌రెడ్డిపై దాడి
Youtuber VS kalyani: హైదరాబాద్‌లోని మధురానగర్‌లో యూట్యూబ్ ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్‌రెడ్డి, సినీనటి కరాటే కల్యాణికి మధ్య గొడవ జరిగింది. ప్రాంక్ వీడియోలు తీయడంపై శ్రీకాంత్ ఇంటికి వెళ్లి కల్యాణి నిలదీసింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆరోపించింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది.
ఈ క్రమంలో మధురానగర్‌లో రోడ్డుపై శ్రీకాంత్‌రెడ్డిని కరాటే కల్యాణి చితకబాదింది. తనపై కూడా శ్రీకాంత్‌రెడ్డి దాడి చేసినట్లు ఆమె తెలిపింది. దీంతో ఇరువురు ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ రెడ్డిపై చర్యలు తీసుకుని అతడి యూట్యూబ్‌ను బ్యాన్ చేయాలని కల్యాణి డిమాండ్ చేశారు. తన ఇంటికి వచ్చిన కల్యాణి అకారణంగా దాడి చేసిందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి:ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్.. రూ.4కోట్ల వాచ్.. రూ.25కోట్ల ఇల్లు.. ఇంకా ఏమున్నాయంటే?