YSRCP ATTACK కొన్ని నెలలగా తాగునీటి కుళాయి రావడంలేదని ప్రశ్నించినందుకు దళిత కుటుంబంపై వైకాపా సర్పంచ్ సోదరుడు దాడి చేసిన ఘటన.. అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది. వెలిగొండ గ్రామానికి చెందిన చిన్నయన్నప్ప తన ఇంటికి 4నెలలగా కుళాయి రావడం లేదని.. తన సోదరుడు బసన్నతో కలిసి సర్పంచ్ సోదరుడు నాగప్పను ప్రశ్నించారు. ఆక్రమంలో.. కులం పేరుతో దూషించారని చిన్నయన్నప్ప, బసన్న ఉరవకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజీ చేసిన తర్వాత.. నాగప్ప తన అనుచరులతో కలిసి దళిత సోదరులపై దాడి చేశారు. యన్నప్పుకు తీవ్రగాయాలు కాగా.. బసన్నకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో నాగప్పతో పాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, దాడి కేసు నమోదు చేసినట్లు సీఐ హరినాథ్ తెలిపారు.
కుళాయి నీళ్లు రావడంలేదని ప్రశ్నించినందుకు వైకాపా సర్పంచ్ సోదరుడి దాడి - అనంతపురం జిల్లా ఉరవకొండ
YSRCP ATTACK ON DALIT కొన్ని నెలలగా తాగునీరు రావడం లేదని ప్రశ్నించినందుకు దళిత కుటుంబంపై వైకాపా నాయకుడు, సర్పంచ్ సోదరుడు దాడి చేశాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇరువురికి సర్ది చెప్పి రాజీ కుదిర్చారు. అయితే సర్పంచ్ సోదరుడు మాత్రం తన అనుచరులతో కలిసి దళితుడిపై దాడి చేశాడు. ఈ దారుణ ఘటన అనంతపురంలో జరిగింది.
YSRCP ATTACK ON DALIT