ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

రెచ్చిపోయిన వైకాపా సర్పంచ్​, విద్యుత్​శాఖ ఏఈపై దాడి

YCP SARPANCH ATTACK వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సర్పంచ్​ విద్యుత్​ శాఖ ఏఈని దుర్భాషలాడాడు. తమ వారికి చెందిన విద్యుత్​ కనెక్షన్లు తొలగించవద్దని హెచ్చరించాడు. అయితే సర్పంచ్​ మాటలను ఏఈ లెక్కచేయకపోవడంతో కోపంతో ఊగిపోయిన సర్పంచ్, విద్యుత్ అధికారిపై దాడి చేశాడు.

YCP SARPANCH ATTACK
YCP SARPANCH ATTACK

By

Published : Aug 17, 2022, 7:10 PM IST

YCP SARPANCH ATTACK అనంతపురం జిల్లా ఉరవకొండ విద్యుత్‌శాఖ ఏఈపై.. నెరిమెట్ల వైకాపా సర్పంచ్‌ యోగేందర్‌రెడ్డి దాడికి పాల్పడ్డాడు. విద్యుత్ బకాయిలు చెల్లించని వారి విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తుండగా ఏఈకి ఫోన్ చేసి దుర్భాషలాడిన సర్పంచ్‌.. తమ వారికి సంబంధించిన ఇళ్లకు సర్వీసు తొలగించవద్దంటూ హెచ్చరించాడు. దీంతో.. ఏపీ ఫోన్‌ కట్‌ చేసి, తన పని తాను చేసుకుంటున్నాడు. దీంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన సర్పంచ్‌ యోగేందర్‌రెడ్డి.. రాయంపల్లిలో ఉన్న ఏఈ గురుమూర్తి వద్దకు వెళ్లి, ఆయనపై దాడి చేశాడు. కాలుతో తన్నడంతోపాటు నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. భయపడిపోయిన గురుమూర్తి పక్కనే ఉన్న సచివాలయంలోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి గురుమూర్తిని కాపాడారు.

అధికార గర్వంతో రెచ్చిపోయిన వైకాపా సర్పంచ్

ABOUT THE AUTHOR

...view details