YouTuber Sarayu trial in Banjara hills PS: తెలంగాణలోని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ సరయూతో పాటు '7ఆర్ట్స్' టీమ్ సభ్యుల విచారణ ముగిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీహెచ్‌పీ అధ్యక్షుడు చేకూరి అశోక్ ఫిర్యాదుతో పోలీసులు సరయూను విచారించారు.
ఇదీ జరిగింది:
సరయూ, ఆమె బృందం ‘'7 ఆర్ట్స్'’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ‘7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్’ కోసం లఘు చిత్రం రూపొందించి గతేడాది ఫిబ్రవరి 25న తన ఛానల్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ చిత్రంలో సరయూ, ఆమె బృందం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించారు.
వీడియో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచే విధంగా ఉండటంతో పాటు మద్యం తాగి హోటల్‌కు వస్తారనే దుష్ప్రచారం అవుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు చేపూరి అశోక్ అక్కడి ఠాణాలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సిరిసిల్ల ఠాణా ఇన్స్పెక్టర్.. బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని ఫిలింనగర్లో వీడియో చిత్రీకరించినట్లు గుర్తించి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో యూట్యూబర్ సరయూను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి(Sarayu Arrest) తీసుకుని విచారించారు.
ఇదీ చూడండి:Case On youtube Actress: యూట్యూబ్ నటిపై కేసు నమోదు.. ఎందుకంటే..?