ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టిన యూట్యూబ్ ఫేం షణ్ముఖ్ - Jublihills road accident news

అతిగా మద్యం సేవించి యూట్యూబ్ ఫేం షణ్ముఖ్ జశ్వంత్ మూడు వాహనాలను ఢీకొట్టిన ఘటన హైదరాబాద్ జూబ్లిహిల్స్​లో చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షణ్ముఖ్‌ను బ్రీత్ అనలైజర్​తో పరీక్షించగా 170 రీడింగ్ చూపించింది.

shanmukh
shanmukh

By

Published : Feb 27, 2021, 10:02 PM IST

మద్యం మత్తులో యూట్యూబ్‌ ఫేం షణ్ముఖ్‌ జశ్వంత్.. కారు నడిపి మూడు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రిలో చేర్పించారు. జూబ్లిహిల్స్‌ పరిధిలోని జర్నలిస్ట్​ కాలనీ హుడాహైట్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టిన యూట్యూబ్ ఫేం షణ్ముఖ్

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని షణ్ముఖ్‌ జశ్వంత్‌ను బ్రీత్ అనలైజర్​తో పరీక్షించగా 170 రీడింగ్ చూపించింది. అతిగా మద్యం సేవించి తన మిత్రుడితో కలిసి జర్నలిస్ట్ కాలనీలో మూడు వాహనాలను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.

షణ్ముఖ్ జశ్వంత్‌తో పాటు కారులో ఉన్న అతని మిత్రుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సాఫ్ట్​వేర్ డెవలపర్ అనే వెబ్​సిరీస్​తో షణ్ముఖ్​ జశ్వంత్ మంచి పేరు సంపాదించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి:

ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్..ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details