ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

SUICIDE: స్నేహితుల మోసం.. కుటుంబసభ్యుల నిరాదరణ..చివరకు - ఏపీ తాజా నేర వార్తలు

వ్యాపారాల్లో వాటాదారులుగా ఉన్న స్నేహితులు మోసం చేశారు. కష్టకాలంలో తోడుండాల్సిన కుటుంబ సభ్యులు మాట్లాడటమే మానేశారు. దీంతో ఒంటరితనాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మేదరమెట్లలో జరిగింది.

youngman-committed-suicde-at-medarametla
స్నేహితుల మోసం, కుటుంబసభ్యుల నిరాదరణ.. ఫలితం వ్యక్తి ప్రాణం

By

Published : Nov 2, 2021, 1:33 PM IST

ప్రకాశం జిల్లా మేదరమెట్లలో ఓ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెదరమెట్లకు చెందిన నాగ సురేశ్‌ అనే వ్యక్తి ఒంగోలుకు చెందిన కొందరితో వ్యాపారం చేశాడు. వాటాదారులు పెట్టిన ఇబ్బందులతో.. లక్షల రూపాయలు అప్పులు చేశాడు. దీంతో కుటుంబసభ్యుల ప్రేమకు దూరమయ్యాడు.

ఆర్థిక ఇబ్బందులు, రాజకీయపరమైన వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్​ నోట్​లో పేర్కొన్నాడు. వ్యాపార భాగస్వాములు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని.. అత్త కూడా తన చావుకు కారణమని లేఖలో పేర్కొన్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details