ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

మహిళపై దుండగుడు దాడి, బ్లేడుతో గొంతు కోసి పరారీ - మహిళపై దుండగుడు దాడి

Youngman attack on woman కుమారుడితో ఉంటున్న ఓ మహిళపై ఓ యువకుడు దాడి చేశాడు. బ్లేడుతో గొంతు కోసి పరారయ్యాడు. స్థానికుల సాయంతో కుమారుడు తల్లిని ఆస్పత్రికి తరలించాడు. అయితే దాడికి పాల్పడింది తెలిసిన వ్యక్తేనా లేక ఇతర కారణాలతో ఎవరైనా దుండగుడు దాడి చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 23, 2022, 8:58 PM IST

Attempt to Murder: కాకినాడ జిల్లాలో ఓ మహిళపై యువకుడు దాడి ఘటన కలకలం రేపింది. శారదా దేవి గుడి సమీపంలో ధనలక్ష్మి అనే మహిళ తన కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. ఈ రోజు ఉదయం ఓ యువకుడు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై బ్లేడుతో దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. ధనలక్ష్మి కుమారుడు స్థానికుల సహాయంతో ఆమెను హస్పిటల్​కి తరలించాడు. సమాచారం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

దాడి చేసిన యువకుడు ధనలక్ష్మికి పరిచయం ఉన్న వ్యక్తా.. లేక ఇంకా వేరే ఇతర కారణాలతో ఎవరైనా దాడి చేసారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు సీఐ రామచంద్రరావు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details