Attack: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కేశానుపల్లిలో యువకులు వీరంగం సృష్టించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రశ్నించిన స్థానికులపై దాడికి పాల్పడ్డారు. పట్టణంలోని పనసతోటకు చెందిన కొందరు యువకులు కాలనీలో అసాంఘిక చర్యలకు పాల్పడుతుంటే మాతంగి రామయ్య అనే వ్యక్తి ప్రశ్నించినట్లు స్థానికులు తెలిపారు. దాంతో కక్ష పెంచుకున్న ఆ యువకులు అర్ధరాత్రి సమయంలో మాస్కులు ధరించి వారి ఇళ్లపై దాడి చేశారన్నారు. ఇంటిలోని ఫర్నిచర్ ధ్వంసం చేసి కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా కొట్టారని వారు వాపోయారు. ఇరువర్గాల పరస్పర దాడుల్లో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ పనులు వద్దన్నందుకు స్థానికులపై యువకుల దాడి - పల్నాడు జిల్లా తాజా వార్తలు
Attack: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రశ్నించిన స్థానికులపై యువకులు దాడికి పాల్పడ్డారు. స్థానికులపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది.
అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని ప్రశ్నించిన స్థానికులపై యువకుల దాడి