ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఆస్తి కోసం... అన్నను చంపించిన చెల్లెలు.. సహకరించిన తల్లి - andhra pradesh news

Man killed for property: సమాజంలో బంధాలు, బంధుత్వాలు కనుమరుగైపోతున్నాయి. ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు... ఆఖరికి కన్నవారినైనా.. కడుపులో పుట్టినవారినైనా కడతేర్చేందుకు వెనకాడడం లేదు. క్షణికావేశం, ఆశతో హత్యలు చేసి.. అటు ఆ కుటుంబాలను.. ఇటు వీళ్ల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.

1
1

By

Published : Jun 28, 2022, 12:50 PM IST

Sister plan for Brother's murder: కర్నూలు జిల్లాలో దిన్నెదేవరపాడుకు చెందిన మాధవస్వామి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం తల్లి, అతని చెల్లెలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో కర్నూలు తాలుకా సీఐ శేషయ్యతో కలిసి కర్నూలు డీఎస్పీ కె.వి.మహేష్‌ సోమవారం వెల్లడించారు.

మాధవస్వామికి గ్రామంలో పెద్దల ద్వారా సంక్రమించిన రూ.60 లక్షల విలువ చేసే 30 సెంట్ల స్థలం ఉంది. దీనిని అమ్మేందుకు తల్లి ఎల్లమ్మ, చెల్లెలు నిర్మలమ్మ ప్రయత్నిస్తుండగా మాధవస్వామి ఒప్పుకోలేదు. దీంతో వారు అతనిపై కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్రణాళిక రూపొందించారు. మాధవస్వామిని చంపేందుకు నిర్మలమ్మ తన ప్రియుడు మాదిగ లక్ష్మన్నతో ఒప్పందం చేసుకున్నారు. హత్యకు ముందు రూ.10 వేలు ఇచ్చేలా.. పని పూర్తయ్యాక 3 సెంట్ల స్థలం లేదా స్థలానికి తగ్గ డబ్బులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈనెల 13వ తేదీన రాత్రి మద్యం తాగేందుకు మాధవస్వామిని లక్ష్మన్న తీసుకెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా మాధవస్వామిపై దాడి చేసి గొంతు కోసి చంపేశాడు.

నిర్మలమ్మ, లక్ష్మన్న సంభాషణలు ఉన్న వాయిస్‌ రికార్డు, హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలతో ఉన్న నిందితుడి దుస్తులు, మోటారు సైకిల్‌ తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపుతున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details