ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

SUICIDE ATTEMPT: పోలీస్​స్టేషన్​లో యువతి ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే..! - anantapur district updates

ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలని పోలీసులను ఆశ్రయించింది ఓ యువతి. పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతుండగానే.. ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మయత్యాయత్నం చేసింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

suicide attemp
ఆత్మహత్యాయత్నం

By

Published : Sep 21, 2021, 4:53 PM IST

మూడేళ్లుగా ప్రేమిస్తున్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో వ్యవహారం పోలీస్ స్టేషన్​కు చేరింది. ఇరువురి వైపు నుంచి పెద్ద మనుషులు పోలీస్ స్టేషన్​కు వచ్చి వారి ప్రేమ వ్యవహారాన్ని చర్చిస్తున్నారు. ఈలోపే యువతి తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగి.. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరి గ్రామీణ సర్కిల్ కార్యాలయంలో జరిగింది.

తలుపుల మండలానికి చెందిన యువతీ, యువకులు ప్రేమించుకున్నారు. తన ప్రియుడితో పెళ్లి చేయాలంటూ యువతీ కోరింది. ఇద్దరు కులాలు వేరు కావడంతో యువకుడి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. పెద్ద మనుషులతో కలిసి ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతిని.. తాను ప్రేమించలేదని, ఆమెతో పెళ్లి తనకు ఇష్టం లేదంటూ తెగేసి చెప్పాడు ఆ యువకుడు. ప్రేమికుడితో పెళ్లి చేయాలంటూ యువతీ భీష్మించుకు కూర్చుంది. ఈ వ్యవహారం తలుపుల పోలీస్ స్టేషన్​కు చేరింది. అక్కడినుంచి కదిరి గ్రామీణ సర్కిల్ కార్యాలయానికి చేరింది.

ప్రేమికుల కుటుంబాలు, గ్రామస్థులతో కదిరి డీఎస్పీ భవ్యకిషోర్, సీఐ మధు వారి ప్రేమ వ్యవహారాన్ని చర్చిస్తున్నారు. ప్రేమ విషయం గురించి యువకుడి ప్రశ్నించగా...తాను ఎవ్వరినీ ప్రేమించలేదని, తాను ప్రేమించినట్లు ఆరోపిస్తున్న అమ్మాయితో తనకు పెళ్లి ఇష్టం లేదన్నాడు. ఈలోపే ఆ యువతీ తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గుర్తించిన పోలీసులు, కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

యువతీ ఆత్మహత్యాయత్నం విషయాన్ని సీఐ దృష్టికి తీసుకెళ్లగా.. యువతీ యువకుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో ప్రేమ వ్యవహారాన్ని చర్చిస్తున్నామని.. ఈలోపే యువతీ పురుగుల మందు తాగినట్లు తెలిసి.. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామన్నారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.

ఇదీ చదవండి

బతికుండగానే భర్త సమాధి పక్కన భార్యల సమాధులు

ABOUT THE AUTHOR

...view details