young man suicide: కరోనా భయంతో యువకుడు ఆత్మహత్య - Chittoor district crime news
08:47 January 19
young man suicide : కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్న కుప్పం యువకుడు
కరోనా భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. 25వ వార్డు పరిధిలోని లక్ష్మీపురానికి చెందిన విజయ్ ఆచారి(30) .. కుటుంబ కలహాలతో నిన్న రాత్రి పురుగులమందు తాగాడు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.
కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో ఆస్పత్రి అద్దాలు పగులగొట్టి భవనం పైనుంచి దూకి విజయ్ ఆచారి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కరోనా భయంతోనే విజయ్ మరణించాడని తెలిపారు.
ఇదీ చదవండి:కడప కలెక్టరేట్‌లో విశ్రాంత ఏఎస్సై కుమారుడి వీరంగం.. కత్తితో బెదిరిస్తూ...