young man suicide: ‘మా అమ్మాయిని మరచిపో. లేదంటే చంపేస్తాం’ అని ఓ యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బెదిరించడంతో దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేములలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. చాకరాజువేములలోని ఎస్సీ వర్గానికి చెందిన ప్రసన్న కుమార్ (24) .. వైయస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి ప్రసన్నకుమార్‌ను బెదిరించారు. యువతిని మరచిపోలేక సోమవారం ఇంట్లో విష గుళికలు మింగారు. స్థానికులు నంద్యాల ఆసుపత్రికి తీసుకెళ్లగా మంగళవారం మృతి చెందారు. ప్రసన్నకుమార్ తల్లి ఫిర్యాదు మేరకు యువతి తల్లిదండ్రులు, మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
‘మా అమ్మాయిని మరచిపో.. లేదంటే చంపేస్తాం’ - నంద్యాల క్రైం వార్తలు
young man suicide: వేగంతో పరిగెడుతున్న కాలంలో మనుషులు మారడం లేదు. కొన్ని ప్రాంతాలలో ఆనాటి పద్దతులు పాటిస్తూ నేటి సమాజానికి మాయనిమచ్చలా తయారవుతున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన దళిత యువకుడు ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు బెదిరించడంతో అతను ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది.
young man suicide