ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

SUICIDE:‘నిన్ను మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి’.. వైరల్ అవుతున్న యువకుడి సూసైడ్​ లేఖ - పల్నాడు జిల్లా తాజా వార్తలు

SUICIDE: ప్రేమ అనే రెండక్షరాలు చాలా మంది జీవితాలను అంధకారం చేస్తుంది. ప్రేమలో మోసపోయామని ఒకరు.. అది విఫలమైందని మరొకరు వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయి దూరమైందనే మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే?

SUICIDE
SUICIDE

By

Published : May 24, 2022, 11:35 AM IST

Updated : May 24, 2022, 12:04 PM IST

SUICIDE: బాపట్ల జిల్లా ఈపూరు మండలం బోడిశంభునివారిపాలెం సమీపంలో రోడ్డు పక్కన ఈనెల 21న చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మాచర్ల గోపిరాజు చివరి లేఖ సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లకు చెందిన గోపిరాజు వినుకొండలో పనులు చేసేవాడు. తాను సొంతూరు వెళుతున్నట్లు స్నేహితులతో చెప్పి పట్టణం దాటాక రోడ్డు పక్కనున్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతను ఓ లేఖ రాశాడు. ముందుగా తన మృతదేహాన్ని తన అన్నకు అప్పగించాలని ఫోన్‌ నంబరు రాశాడు. అనంతరం ప్రేయసిని సంబోధిస్తూ కవిత్వం రాశాడు ‘ఏ అమ్మాయి.. నువ్వే గెలిచావు.. నేనే ఓడిపోయా.. నేను ఏ తప్పూ చేయలేదు.. నేను ఎప్పుడూ ఓడిపోలా.. ఇపుడే ఓడిపోయా.. ఈ జన్మకు నీవే నా భార్య అని ఊహించుకున్నా.. కానీ నాకు ఆ అదృష్టం లేదు.. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా.. మర్చిపోవాలంటే ముందు చచ్చిపోవాలి.. ఐ మిస్‌యూ.. లైఫ్‌లో ఎప్పుడూ కనిపించను.. ‘నా చావుకు నేనే కారణం’ అని లేఖ ముగించాడు. ఇది చూసినవారు ప్రేమ కోసం ప్రాణం తీసుకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Last Updated : May 24, 2022, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details