ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

క్రికెట్​ బెట్టింగ్​, ఆన్​లైన్​ వేధింపులకు యువకుడు బలి - crime news in ap

YOUNG MAN DIED DUE TO LOAN APPS : ఆ యువకుడికి క్రికెట్​ బెట్టింగ్​ కోసం డబ్బులు కావాల్సి వచ్చాయి. అనుకున్నదే తడవుగా ఆన్​లైన్​లో తీసుకున్నాడు. కొన్ని చెల్లించాడు. మిగిలిన వాటి కోసం రుణయాప్​ల నుంచి వేధింపులు మొదలైయ్యాయి. వాటిని చెల్లించే మార్గం లేక మానసిన వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

YOUNG MAN DIED DUE TO LOAN APPS
YOUNG MAN DIED DUE TO LOAN APPS

By

Published : Jan 6, 2023, 6:05 PM IST

Updated : Jan 6, 2023, 7:04 PM IST

YOUNG MAN DIED : ఆన్​లైన్​లో అవసరాలకు డబ్బులు తీసుకోవడం.. అవి చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకోవడం సహజమైంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్నిసార్లు ఆన్​లైన్​ రుణాలు తీసుకోవద్దని సూచించినా.. అవసరానికి తీసుకుని వాటిని తిరిగి కట్టలేక మానసిక సంఘర్షణకు గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా రుణయాప్​ల ఒత్తిడి, క్రికెట్​ బెట్టింగ్​ రెండు కలిసి ఓ యువకుడిని బలి తీసుకున్నాయి.

కృష్ణా జిల్లా గన్నవరం హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన రోహిత్‌ రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన కుంటుబ సభ్యులు పిన్నమనేని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోహిత్‌ మృతికి క్రికెట్‌ బెట్టింగ్‌, లోన్‌ యాప్‌లే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు జరిగినట్టు ఏ తల్లిదండ్రులకూ జరగకూడదని.. పోలీసులు, ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని తండ్రి రామయ్య విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

క్రికెట్​ బెట్టింగ్​, ఆన్​లైన్​ వేధింపులకు యువకుడు బలి

ఇవీ చదవండి:

Last Updated : Jan 6, 2023, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details