SUICIDE ATTEMPT అనంతపురంలో ఓ వివాహిత తన ప్రేమను తిరస్కరించిందని.. యువకుడు కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అనంతపురం శివారు ఎల్బీనగర్కు చెందిన బాలాజీ నాయక్.. పాపంపేటకు చెందిన వివాహితను ప్రేమించాలని ఒత్తిడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వివాహిత నిరాకరించడంతో కత్తితో గొంతు కోసుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
వివాహిత ప్రేమను తిరస్కరించిందని గొంతు కోసుకున్న యువకుడు, పరిస్థితి విషమం - ఏపీ నేర వార్తలు
SUICIDE ATTEMPT ప్రేమను తిరస్కరించిందని ప్రేమికురాలిని చంపడమో లేదా బెదిరించడం లాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాాగా అనంతపురంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కాకపోతే ఇక్కడో రివర్స్ సీన్ జరిగింది. వివాహిత ప్రేమించలేదని ఓ యువకుడు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
SUICIDE ATTEMPT