కదిరిలోని చౌక్ ప్రాంతంలో యువకుడి దారుణ హత్య - ap latest crime news
08:37 September 13
హతుడు మహారాష్ట్రకు చెందిన కిరణ్‌గా గుర్తించిన పోలీసులు
అనంతపురం జిల్లా కదిరిలోని చౌక్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో.. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపేశారు. యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. హుటాహుటిన రంగంలోకి దిగిన కదిరి పట్టణ సిఐ శ్రీనివాసులు, ఎస్సై బసప్ప.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
యువకుడు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హతుడు మహారాష్ట్రకు చెందిన కిరణ్‌గా పోలీసులు గుర్తించారు. కిరణ్ గత పదేళ్ల నుంచి కదిరిలోని ఓ బంగారం దుకాణంలో ఆభరణాల తయారుచేస్తున్నాడని వివరించారు. మృతుడిని ఎవరు, ఎందుకు హత్య చేశారో తెలుసుకునే పనిలో ఉన్నట్లు పోలీసులు వివరించారు.
ఇదీ చూడండి:BOARDS MEETING: ఇవాళ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ