YOUNG MAN DIED: కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తోట్లవల్లూరు మండలం గురివిందపల్లి గ్రామానికి చెందిన గుమ్మడి చందు (18) అనే యువకుడు కృష్ణా నదిలో మునిగిపోయాడు. పశువులను నది దాటిస్తుండగా మధ్యలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. గజఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా నదిలో యువకుడు గల్లంతు.. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు
YOUNG MAN DIED: కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో విషాదం చోటుచేసుకుంది. పశువులను నది దాటిస్తుండగా ఓ యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
YOUNG MAN DIED