రషీద్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. నిర్మాణ దశలో ఉన్న తన ఇంటికి పైపుతో నీటిని పడుతుండగా ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ప్రియాంక నగర్ లో జరిగింది. కొత్తగా నిర్మాణంలో ఉన్న తన ఇంటి సిమెంట్ దిమ్మెలకు పైపుతో నీటిని పెడుతుండగా అకస్మాత్తుగా మోటర్ నుంచి విద్యుత్ ప్రవహించడంతో రషీద్ అక్కడిక్కక్కడే మృతి చెందాడు. బెంగళూరులో ఉద్యోగం చేసే రషీద్ ఇంటి వద్దనే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడని రెండేళ్ల క్రితమే ఇతనికి వివాహమైందని స్థానికులు తెలిపారు. రషీద్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
విద్యుదాఘాతంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి - sri satyasai district news
ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉందామనుకున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కల.. కలగానే మిగిలింది. నిర్మాణ దశలో ఉన్న తన ఇంటికి పైపుతో నీటిని పడుతుండగా ప్రమాదవశాత్తు రషీద్ అనే యువకుడు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ప్రియాంక నగర్ లో జరిగింది.
young man died with electrical shock