ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఆమె టైమ్‌పాస్‌ ప్రేమతో పిచ్చోడినయ్యా.. సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య - AP highlights

young man committed suicide: ఆమె టైమ్‌పాస్‌ ప్రేమ వల్ల పిచ్చోడినయ్యా.. నాపై ప్రేమ నటిస్తూ లెక్చరర్‌తో నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడుతోంది.. అబ్బాయిలు మోసం చేస్తే హైలెట్‌ చేస్తారు.. అదే అమ్మాయిలు చేస్తున్న మోసాన్ని సమాజం ఎందుకు ప్రశ్నించదు’ అంటూ యువకుడు సూసైడ్‌ నోట్‌ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

young man committed suicide
ఆమె టైమ్‌పాస్‌ ప్రేమతో పిచ్చోడినయ్యా: సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య

By

Published : Jan 9, 2023, 1:21 PM IST

young man committed suicide: ‘ఆమె టైమ్‌పాస్‌ ప్రేమ వల్ల పిచ్చోడినయ్యా.. నాపై ప్రేమ నటిస్తూ ఓ లెక్చరర్‌తో నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడుతోంది.. అబ్బాయిలు మోసం చేస్తే హైలెట్‌ చేస్తారు.. అదే అమ్మాయిలు చేస్తున్న మోసాన్ని సమాజం ఎందుకు ప్రశ్నించదు’ అంటూ యువకుడు సూసైడ్‌ నోట్‌ రాసి బలవన్మరణానికి పాల్పడిన ఘటన విజయవాడలో జరిగింది. విజయవాడ రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణలంకకు చెందిన అబ్దుల్‌ సలాం(19) కానూరులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థిని తనను ప్రేమించినట్లు నటిస్తూ మోసం చేయడంతో జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి వన్‌టౌన్‌ నైజాం గేటు సెంటరు సమీపంలో రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ లేఖను జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ పార్థసారథి తెలిపారు. ఆదివారం సాయంత్రం పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details