ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

పారిపోయిన ప్రేమజంట.. యువకులను చితకబాదిన సర్పంచ్.. మనస్తాపంతో..! - sarpanch attack

Suicide: ఓ ప్రేమ జంట గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇందుకు కొందరు యువకులు సాయం చేశారనే అనుమానంతో సర్పంచ్ వారిని చితకబాదాడు. గ్రామస్థులందరి ముందే కొట్టడంతో ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.​

Young man commits suicide after being hit by sarpanch in badradri district
పారిపోయిన ప్రేమజంట.. యువకులను చితకబాదిన సర్పంచ్.. మనస్తాపంతో..!

By

Published : Jun 15, 2022, 9:06 AM IST

సర్పంచ్​ తనను గ్రామస్థుల ఎదుటే కొట్టాడనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన.. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లాలో ఆందోళనకు దారితీసింది. అశ్వారావుపేట మండలం నారవారిగూడెంనకు చెందిన ప్రేమ జంట మూడు రోజుల క్రితం గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇందుకు గ్రామానికి చెందిన ఓ ఐదుగురు యువకులు సాయం చేశారనే అనుమానంతో వారిలో ఇద్దరిని.. గ్రామ సర్పంచ్ వెంకట ముత్యం గ్రామస్థుల ఎదుట చితకబాదాడు.

ఇందులో ఇంటర్మీడియట్ చదువుతున్న భవాని శంకర్ అనే యువకుడు మనస్తాపం చెంది.. అదే రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన కొత్తగూడెం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో భవానీ శంకర్​ మృతికి కారణమైన సర్పంచ్​పై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబసభ్యులు అశ్వారావుపేట పోలీస్​స్టేషన్​ ఎదుట ఆందోళన చేపట్టారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. ఈ మేరకు సర్పంచ్ వెంకట ముత్యంపై కేసు నమోదు చేసినట్లు అశ్వారావుపేట ఎస్సై అరుణ తెలిపారు.

పారిపోయిన ప్రేమజంట.. యువకులను చితకబాదిన సర్పంచ్.. మనస్తాపంతో..!

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృతుడు భవానీ శంకర్ తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గ్రామస్థులందరి ముందు సర్పంచ్ వెంకట ముత్యం కొట్టడమే కారణమని సెల్ఫీ వీడియో తీసుకుని స్నేహితులకు పంపించాడు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇవీ చూడండి..అప్పుల మోత.. వడ్డీ వాత.. ఇప్పటికే రూ.13,500 కోట్ల బహిరంగ రుణం

ABOUT THE AUTHOR

...view details