ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఇన్​స్టాలో చాటింగ్​... పెళ్లి అనగానే చీటింగ్​ - telangana news today

రెండేళ్ల క్రితం ఓ అమ్మయికి ఇన్​స్టాలో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానంటూ యువకుడు మాయమాటలు చెప్పి కామకోరికలు తీర్చుకున్నాడు. తీరా ఆమె వివాహం ప్రస్తావన తేవడంతో ఆమెను కాదన్నాడు. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.

young man cheating girl on instagram
ప్రేమించి మోసం చేసిన యువకుడు

By

Published : Mar 3, 2021, 4:36 AM IST

ప్రేమించి మోసం చేసిన యువకుడు

సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమై రెండేళ్లు ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి చేసుకునేందుకు ఆ యువకుడు నిరాకరిస్తున్నారని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఖమ్మంలో ఆ బాధిత యువతి వివరాలు వెల్లడించింది.

ఖమ్మం జిల్లాకు చెందిన ఆ యువతి బీ ఫార్మసీ చివరి సంవత్సరం చదువుతోంది. రెండేళ్ల క్రితం ఇన్​స్టా గ్రామ్​లో ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నోవాతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనను శారీరకంగా లోబరుచుకున్నాడని ఆమె పేర్కొంది.

ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని కన్నీటి పర్యంతమైంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఇలాంటి పరిస్థితి మిగతా అమ్మాయిలకు రావద్దొని కోరుకుంటోంది.

ఇదీ చూడండి :యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

ABOUT THE AUTHOR

...view details