ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తూర్పు గోదావరిలో దారుణం.. యువతిపై సుత్తితో ప్రేమోన్మాది దాడి.. ఆపై ఆత్మహత్యాయత్నం - ఏపీ తాజా వార్తలు

young man attack on mother and two daughters
young man attack on mother and two daughters

By

Published : Dec 24, 2022, 10:52 AM IST

Updated : Dec 24, 2022, 1:46 PM IST

10:46 December 24

బ్లేడ్‌తో గొంతు కోసుకున్న వెంకటేశ్‌, ఆస్పత్రికి తరలింపు

YOUNG MAN ATTACK ON MOTHER AND TWO DAUGHTRES : తూర్పుగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతితో పాటు ఆమె తల్లి, సోదరిపై సుత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్‌ మూడు రోజుల క్రితం కడియపులంక గ్రామానికి చెందిన యువతి తండ్రికి ఫోన్ చేసి బెదిరించాడు. ‘‘మీ రెండో కుమార్తెను ప్రేమించాను.. నాతో పెళ్లి చేయాలి. లేదంటే మీ అమ్మాయిని చంపేస్తా’’ అని యువతి తల్లిదండ్రులను హెచ్చరించాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించిన వెంకటేశ్‌.. యువతి తలపై సుత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె తల్లి, సోదరిపైనా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం వెంకటేశ్‌ తన గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు" అని తెలిపారు.

యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తిలక్‌, ఎస్సై అమీనా బెగం తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం, ఆత్మహత్యాయత్నం క్రింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుడి వెంట మరో నలుగురు యువకులు కూడా వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దాడిలో వారి పాత్రపైనా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం యువతి, ఆమె కుటుంబసభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో, నిందితుడు స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని.. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 24, 2022, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details