శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరులో యువ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏడాది క్రితం వివాహం చేసుకున్న రమేశ్, రాధ.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 24 ఏళ్ల రమేశ్, 21 ఏళ్ల రాధ.. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి రమేశ్ తల్లి ఆదెమ్మ గ్రామంలోకి వెళ్లిన సమయంలో.. దంపతులు ఇంట్లో పైకప్పుకు ఉరివేసుకున్నారు. రమేష్ తల్లి ఇంటికి చేరుకోగానే కుమారుడు, కోడలు ఉరి వేసుకుని ఉండటం చూసి.. బోరున విలపించింది. ఆమె రోదనలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. దంపతులు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మనస్పర్థల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
యువ దంపతుల ఆత్మహత్య.. మనస్పర్థలే కారణమా..? - ap news
వారికి ఏ కష్టమొచ్చిందో తెలియదు.. నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించారు. ఎన్నో ఆశలతో వివాహ జీవితాన్ని ప్రారంభించిన వారిద్దరూ... ఏడాదికే బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే మనస్పర్థల కారణంగానే ఉరేసుకుని చనిపోయి ఉంటారని స్థానికులంటున్నారు.
suicide