ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Suicide: ప్రాణాలు తీసిన వాట్సప్‌ స్టేటస్‌ - యువకుడిపై వైకాపా నాయకుల దాడి

Attack: ఓ యువకుడు పెట్టిన వాట్సప్ స్టేటస్ అతని ప్రాణాలు పోవడానికి కారణమైంది. అదేంటి స్టేటస్ పెడితే ప్రాణాలు పోవడం ఏంటి అనుకుంటున్నారా? అవునండీ అదే జరిగింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. దాని గురించి మీరు తెలుసుకోండి...

ycp sarpanch attack on youngster
యువకుడిపై వైకాపా నాయకుల దాడి

By

Published : Apr 12, 2022, 6:56 AM IST

Updated : Apr 12, 2022, 8:59 AM IST

Attack: ‘బాధ్యత గల సర్పంచి పదవిలో ఉంటూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తగదు’ అంటూ ఓ యువకుడు వాట్సప్‌లో పెట్టిన స్టేటస్‌ చివరకు ప్రాణాలు తీసింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లిలో జరిగింది. 'కొత్తపల్లికి చెందిన సుదర్శన్‌ నారాయణ, శకుంతల కుమారుడు శ్రీనివాస్‌(26) ప్రైవేటు ఉద్యోగి. తాను సన్నిహితంగా ఉంటున్న యువతి పట్ల సర్పంచి కన్నం శ్యామ్‌, వైకాపా నాయకులు అద్దెపల్లి శ్రీనివాసరావు ఇటీవల అసభ్యంగా ప్రవర్తించారు. ఇదే విషయాన్ని శ్రీనివాస్‌ తన వాట్సప్‌ స్టేటస్‌లో ప్రశ్నించాడు. ఆగ్రహించిన సర్పంచి, అనుచరులు ఆదివారం శ్రీనివాస్‌ను రాళ్లతో కొట్టారు' అని అనకాపల్లి గ్రామీణ సీఐ జి.శ్రీనివాసరావు వెల్లడించారు.

ప్రాణాలు తీసిన వాట్సప్‌ స్టేటస్‌

సోమవారం మధ్యాహ్నం శ్రీనివాస్‌ తన స్నేహితులకు వాయిస్‌ మెసేజ్‌ పంపించాడు. ‘నాకు బతకాలని లేదు. సర్పంచి శ్యామ్‌ తనను ఇబ్బంది పెట్టారని ఓ అమ్మాయి చెబితే, స్టేటస్‌ పెట్టాను. ఏ తప్పు చేశానని నన్ను కొట్టారు? అధికారం ఉంటే ఏమైనా చేస్తారా? నా చావు తర్వాతైనా నిజానిజాలు బయటకు వస్తాయి’ అంటూ అందులో వాపోయాడు. మిత్రులు ఇంటి వద్దకు వచ్చి చూడగా, అప్పటికే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుపై సర్పంచి శ్యామ్‌, శ్రీనివాసరావు, కన్నం కిశోర్‌, వి.శ్రీను, ఎస్‌.సురేష్‌, ఎస్‌.ప్రేమ్‌లపై కేసు నమోదుచేసి, ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఠాణా వద్ద మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు పరామర్శించారు. నిందితులను శిక్షించాలని, శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటుతో... పోలీసు యూనిట్ల హద్దుల్లో మార్పు

Last Updated : Apr 12, 2022, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details