YCP Leaders Attack on Govt Employees: విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్తివానిపాలెంలో అధికారులపై వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. రేవళ్ల చెరువులో 10 ఎకరాల వరకు ఆక్రమణకు గురైన విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేశ్ ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. వెంటనే జేసీబీలతో వెళ్లి ఆక్రమణలను తొలిగించే ప్రయత్నం చేశారు.
దీంతో ఆగ్రహించిన వైకాపా నేతలు.. పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేశ్‌పై దాడికి దిగారు. అధికారులు ఈ ఘటనపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లారు.