YCP LEADER MURDER IN SRIKAKULAM : శ్రీకాకుళం జిల్లా గార మండల ప్రాథమిక పరిషత్ ఉపాధ్యక్షుడు, వైసీపీ నేత రామశేషు దారుణ హత్యకు గురయ్యారు. శ్రీకూర్మంలోని తన గ్యాస్ గోడౌన్ వద్దకు వాకింగ్ క్‌కు వెళ్లిన సమయంలో దుండగులు హతమార్చారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పల్సర్ బైకుపై వచ్చి.. కత్తితో మెడపై నరికారు. రామశేషు అక్కడికక్కడే మృతి చెందారు. రక్తపుమడుగులో పడి ఉన్న రామశేషును చూసి.. బంధువులు రోదిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. హత్యకు గల కారణాలు ఆరా తీస్తున్నారు.
శ్రీకాకుళంలో దారుణం.. వైసీపీ నేతని కిరాతకంగా హత్య చేసిన దుండగులు - శ్రీకాకుళంలో వైసీపీ నేత దారుణ హత్య
PRIMARY PARISHAD PRESIDENT MURDER : శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. గార మండల ప్రాథమిక పరిషత్ ఉపాధ్యక్షుడు, వైసీపీ నేత రామశేషును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
YCP LEADER MURDER IN SRIKAKULAM