ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

చెప్పినట్లు వింటే సరి... లేకపోతే.. వైకాపా కౌన్సిలర్ దౌర్జన్యం - పల్నాడు జిల్లా తాజా వార్తలు

Attack: పాల వ్యాపారం చేసుకునే మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై వైకాపా కౌన్సిలర్ దాడి చేశాడు. పాల బూత్ ఖాళీ చేయిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎందుకని ప్రశ్నించినందుకు ఘర్షణకు దిగాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా వినుకొండలో జరిగింది.

Attack
పాల వ్యాపారం చేసుకునే మహిళ, ఆమె కుటుంబంపై వైకాపా కౌన్సిలర్ దాడి

By

Published : May 8, 2022, 12:47 PM IST

Attack: పల్నాడు జిల్లా వినుకొండలో పాల వ్యాపారం చేసుకునే మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై వైకాపా కౌన్సిలర్ దాడి చేశాడు. గత కొన్ని నెలలుగా వేధింపులకు పాల్పడుతున్న కౌన్సిలర్‌... నిన్న సాయంత్రం గొడవకు దిగాడు. పాల బూత్ ఖాళీ చేయిస్తానని బెదిరింపులకు దిగాడు. ఎందుకని ప్రశ్నించినందుకు ఘర్షణకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఇరువురిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత కౌన్సిలర్ భార్య, కుమారుడు షాపులో ఉన్న తన భర్త, కుమారుడిపై దాడి చేశారని బాధిత మహిళ వాపోయారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్నా తమకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పాల వ్యాపారం చేసుకునే మహిళ, ఆమె కుటుంబంపై వైకాపా కౌన్సిలర్ దాడి

ABOUT THE AUTHOR

...view details