ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ATTACK: తెదేపా నేత సుభానిపై.. వైకాపా వర్గీయల దాడి.. కారణం అదేనా? - గుంటూరు జిల్లా తాజా వార్తలు

ATTACK: అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేసినందుకు తెలుగుదేశం నేత సుభానిపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సుభాని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

ATTACK
తెదేపా నేత సుభానిపై.. వైకాపా వర్గీయల దాడి

By

Published : May 30, 2022, 12:39 PM IST

ATTACK:గుంటూరు జిల్లా తాడికొండ మండలం లామ్ గ్రామంలో అక్రమ మైనింగ్​పై ఫిర్యాదు చేసినందుకు తెలుగుదేశం నేత సుభానిపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన సుభాని గుంటూరు జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నారు. బాధితుడిని తెలుగుదేశం నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, నసీర్ అహ్మద్ పరామర్శించారు. అక్రమాలపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం శ్రేణులపై దాడులకు పాల్పడేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తన తండ్రిపై దాడి చేసినవారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాధితుడి కుమార్తె డిమాండ్ చేశారు.

తెదేపా నేత సుభానిపై.. వైకాపా వర్గీయల దాడి

ABOUT THE AUTHOR

...view details