చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం బసినికొండలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఫ్యాన్‌కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన ఎస్.సల్మా(17)... ఈ మధ్య ఫోన్ ఎక్కువగా మాట్లాడుతోంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు తరచూ ఫోన్ వాడొద్దని, ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావు అంత సేపంటూ మందలించారు.
WOMEN SUICIDE: ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పినందుకు యువతి ఆత్మహత్య - ఏపీ 2021 వార్తలు
ఫోన్ ఎక్కువగా చూస్తుందని... కుటుంబ సభ్యులు మందలించడంతో ఓ యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా బసినికొండలో జరిగింది.
ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పినందుకు యువతి ఆత్మహత్య
కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెందిన సల్మా ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దు అన్నందుకే కూతురు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:Bandla Ganesh: నాకెందుకు ఇస్తారయ్యా నోటీసులు... నేనసలు వక్కపోడే వేసుకోను!