suicide attempt: కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళ ఆత్మహత్యాయత్నం - chittoor district updates
12:19 September 20
భూ సమస్య పరిష్కరించడం లేదంటూ ఆత్మహత్యాయత్నం
చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. జిల్లాలోని రామచంద్రపురం మండలం కొత్త వేసుకుప్పంకు చెందిన రమణమ్మ భూ సమస్యపై కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లింది. తన సమస్యపై ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్, ఎస్పీకి వినతిపత్రం ఇచ్చినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం ఆమె వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. తక్షణం ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి