ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

'కుటుంబ సభ్యులే చంపాలని చూశారు.. ఆ ఘటనతో నా ప్రియుడికి ఎటువంటి సంబంధం లేదు' - guntur latest news

కుటుంబ సభ్యులు కావాలనే తన ప్రేమికుడిపై హత్యారోపణలు మోపుతున్నారని ఓ యువతి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. రెండు రోజుల క్రితం గుంటూరులో కలకలం సృష్టించిన ఈ ఉదంతంపై సదరు యువతి స్పష్టత ఇచ్చింది. కావాలనే తమ కుటుంబ సభ్యులు ప్రేమికుడిపై హత్యారోపణలు చేస్తున్నారని మండిపడింది.

women selfie video
సెల్ఫీ వీడియో

By

Published : Jul 24, 2021, 12:45 PM IST

ప్రియుడికి ఎటువంటి సంబంధం లేదు

కుటుంబ సభ్యులు కావాలనే తన ప్రేమికుడిపై హత్యారోపణలు మోపుతున్నారని ఓ యువతి సెల్ఫీ వీడియోలో వెల్లడించింది. రెండురోజుల క్రితం గుంటూరు జిల్లా అమర్తలూరు మండలానికి చెందిన ఉమామహేశ్వర రావు ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి కారులో తీసుకెళ్లి పురుగుల మందు తాగించాడని యువతి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అందులో నిజం లేదని కావాలనే తన ప్రేమికుడ్ని ఇరికించారని యువతి తెలిపింది. తానే తమ ఇంటి వద్ద పురుగుమందు తాగి ఉమామహేశ్వరరావు దగ్గరకు వెళ్లినట్లు వీడియోలో పేర్కొంది.

సంబంధిత కథనం:Love Cheating: ప్రేమ పేరుతో మోసం.. ఆత్మహత్య పేరిట యువతిని చంపేందుకు యత్నం

అంతా మేనమామే చేస్తున్నాడు..

తన మేవమామ కావాలనే తప్పుడు ఫిర్యాదు ఇప్పించినట్లు ఆమె వీడియోలో వివరించింది. పురుగుల మందు తాగినట్లు ఉమామహేశ్వరరావుకు తెలపడంతో తమ సొంత కారు తీసుకుని తెనాలి ఆసుపత్రికి వెళుతుండగా మార్గ మధ్యలో తన మేనమామ ఆ కారు ఆపి తమ ఇద్దరిపై దాడి చేశారని ఆరోపింపించింది. ఉమామహేశ్వర రావుపై కేసు పెట్టాలనే ఉద్దేశంతోనే తమ కుటుంబ సభ్యులు బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉంచుతున్నారని.. అక్కడినుంచి తప్పించుకుని బయటకు వచ్చి ఈ వీడియో పంపుతున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:

పెళ్లి పేరుతో నమ్మించింది... హిజ్రాగా మార్పించింది.. చివరికి వంచించింది..!

30న రెండో డిప్యూటీ మేయర్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక

ABOUT THE AUTHOR

...view details