murders: మహిళపై అత్యాచారయత్నం.. ఆపై హత్య.. ఆ తర్వాత - kamapalli news
22:46 October 17
ప్రకాశం జిల్లాలో దారుణం
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను అత్యాచారం చేయబోయి, ఆమె ప్రతిఘటించడంతో కాళ్లు, చేతులు కట్టేసి గొడ్డలితో నరికి చంపాడో భూతవైద్యుడు. విషయం తెలిసిన గ్రామస్థులు అతడిని కర్రలతో కొట్టి చంపారు. అతన్ని కాపాడబోయి జరుగుమల్లి ఎస్సై రజియా సుల్తానా బేగం గాయపడ్డారు.
కామేపల్లికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మి అలియాస్ విజయ(42) వ్యవసాయ పనుల కోసం కూలీలను పిలిచేందుకు ఆదివారం రాత్రి వుడ్డెపాలెం వెళ్లారు. సోమవారం ఉదయం కూలీలను పిలుస్తుండగా అదే కాలనీకి చెందిన వల్లెపు ఓబయ్య(51) ఆమెను పలకరించాడు. మోకాళ్ల నొప్పులకు మందులిస్తాను రమ్మంటూ ఇంటికి పిలిచాడు. నమ్మి వెళ్లిన విజయను బలాత్కరించేందుకు ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించి గట్టిగా కేకలు వేసింది. దాంతో ఓబయ్య ఆమె కాళ్లు, చేతులు కట్టేసి గొడ్డలితో నరికి చంపాడు. తర్వాత ఈ విషయాన్ని తన కుటుంబీకులకు చెప్పాడు. వారు వెంటనే జరుగుమల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రజియా సుల్తానా బేగం సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు ఓబయ్యను తమ వాహనంలో స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామస్థులు పోలీసు వాహనంలో ఉన్న ఓబయ్యను బయటకు లాగి కర్రలతో కొట్టారు. అడ్డుకోబోయిన ఎస్సైమీదా దాడి చేశారు. స్థానికుల దాడిలో ఓబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కామేపల్లిలో ఉద్రిక్తత నెలకొనడంతో.. పోలీసులు పెద్దఎత్తున మోహరించారు.
ఇదీ చదవండి