కుటుంబ సమస్యలతో మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసిన నవ వధువు తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కడప జిల్లా పుల్లంపేటకు చెందిన యువతికి ఇటీవలే వివాహమైంది. పెళ్లైన రోజు నుంచే కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్లు బంధువులు తెలిపారు. గత కొద్ది రోజులుగా సమస్యలు ఎక్కువ కావడంతో మంగళవారం విషపు గుళికలు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు యువతిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పుల్లంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విష గుళికలు తిని నవ వధువు ఆత్మహత్య - చికిత్స పొందుతూ నవ వధువు మృతి తాజా వార్తలు
కుటుంబ సమస్యలతో విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఓ నవ వధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు(బుధవారం) మృతి చెందింది. ఈ ఘటన కడప జిల్లా పుల్లంపేటలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ నవవధువు మృతి