తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల శివారు వాంకుతోడు తండాలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ.. భర్త మర్మాంగంపై దాడి చేసింది(women attacked her husband penis). తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి (spot death) చెందాడు.
వాంకుతోడు తండాకు చెందిన భూక్యా బిచ్యా(50), ప్రమీల దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసైన బిచ్యా.. రోజు తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. మంగళవారం రాత్రి కూడా మద్యం సేవించి వచ్చిన బిచ్యా.. భార్యతో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగి.. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ప్రమీల.. భర్త మర్మాంగంపై దాడిచేయడంతో అతడు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు.